May 10, 2026
Explore
విద్యార్థులకు సన్మానం

విద్యార్థులకు సన్మానం

May 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పదోతరగతిలో ప్రతిభ కనబరచి, అధిక మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు పుంగనూరు గాయిత్రిమాత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘ నాయకులు సన్మానించి అభినందించారు. ఆదివారం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన లిఖిత, ప్రణిత్‌, అలేఖ్య, రెడ్డివిష్ణుప్రియ, శ్రావణిలకు సన్మానం చేసి , ప్రసంసాపత్రాలు , నగదు అందజేసి వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రామమూర్తి, ఉదయ్‌కుమార్‌, మధుకుమార్‌శర్మ, అశ్వర్థనారాయణ, రవికుమార్‌, శ్రీధర్‌, నారాయణ, డాక్టర్‌ రమణరావు, రాజేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Honoring Students