May 10, 2026
Explore
సయ్యద్‌ నూర్‌షావలి బాబా ఉరుసు వైభవంగా ముగిసింది

సయ్యద్‌ నూర్‌షావలి బాబా ఉరుసు వైభవంగా ముగిసింది

May 10, 2026 | Andhra Pradesh

ఖవ్వాలి పాటల హోరు

  • కిటకిటలాడిన మైదానం

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్‌ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్సవం మూడవ రోజు ఆదివారం రాత్రి ముస్లింలు రాకతో వైభవంగా నిర్వహించారు. రాత్రితో ఉరుసు ముగిసింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు , హజరత్‌లు దర్గాలో చాదర్‌, పూలు వేసి ముస్లిం పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఖవ్వాలి పాటలను నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్‌ఖాదరి లచే వేకువజాము వరకు నిర్వహించారు. ఖవ్వాలి పాటల పోటీలు ప్రజలను ఉర్రుతలూగించింది. ఉరుసు సందర్భంగా దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ మదనపల్లె డిఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ, పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండ ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించారు.

Tags: The Urs of Syed Noor Shah Wali Baba concluded with great grandeur.