పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని సుబేదారువీధిలో గల చౌక్‌మసీదు కాంప్లెక్స్ నిర్మాణానికి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఆదివారం ఈ మేరకు అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో తొలివిడత నిధులను మసీదుకమిటి చైర్మన్ నజీర్‌సాబ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అలీమ్‌బాషా మాట్లాడుతూ మసీదు కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు కావాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపి మిధున్‌రెడ్డి లను కోరామన్నారు. తక్షణమే రూ.20 లక్షలు మంజూరు చేయడంతో కాంప్లెక్స్ నిర్మాణం దాదాపుగా పూర్తికాబడిందన్నారు. ముస్లింలపై అభిమానంతో నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే, ఎంపిలకు ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఖాదర్‌బాషా, రహమత్, ఖాదర్, న్యామత్, నూర్, అనీస్, అంజాద్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Construction of a Mosque Complex Funded by MP Midhun