March 18, 2026
Explore
ఓటర్ల జాబితాపై బిఎల్‌వోలకు అవగాహన

ఓటర్ల జాబితాపై బిఎల్‌వోలకు అవగాహన

March 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఓటర్ల జాబితాపై బిఎల్‌వోలు అవగాహన చేసుకోవాలని తహశీల్ధార్‌ రాము తెలిపారు. బుధవారం ఆయన బిఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పక్రియలో బిఎల్‌వోల పాత్ర చాలా కీలకమైందన్నారు. ప్రతి ఇంటి ఇంటికి సర్వే నిర్వహించి ప్రతి ఇంటిలో వారి ఓటు హక్కులో ఎలాంటి తప్పులు ఉన్న వాటిని ఫారం 8 ద్వారా సరి చేయాలని కోరారు. ముఖ్యంగా ఫారం నెంబరు 6, 7, 8 పై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలో బోగస్‌, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు.

Tags: Awareness for BLOs on Voter Lists