May 10, 2026
Explore
సీఎంగావిజయ్‌…పుంగనూరులో సంబరాలు

సీఎంగావిజయ్‌…పుంగనూరులో సంబరాలు

May 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరులో కాంగ్రెస్‌ , వామపక్షపార్టీ నాయకులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. తమిళనాడు సీఎంగా టివికె అధినేత విజయ్‌ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలోని మున్సిపల్‌ బస్టాండ్‌ ఆవరణంలో బాణసంచాలు పేల్చి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం వెహోదలైందన్నారు. ప్రజలకు కొత్త సిఎం సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ సహాయ కార్యదర్శి మున్నా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సజ్జాద్‌, అల్తాఫ్‌, ముభారక్‌, ఫయాజ్‌, అజ్మత్‌, షాహిదా తదితరులు పాల్గొన్నారు.

Tags; Vijay as CM… Celebrations in Punganur.