పుంగనూరుముచ్చట్లు:
సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టినట్లు డిఎస్‌వో రెడ్డిచంద్రిక తెలిపారు. గురువారం ఆమె పట్టణంలో బియ్యం సరఫరా చేసేందుకు పలు ప్రాంతాలను పరిశీలించారు. తూర్పువెహోగశాల , టమోటా మార్కెట్ యార్డు వద్దగల రైతు బజారు ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కిలో రూ.49 లకే నాణ్యమైన సన్నబియ్యం త్వరలో విక్రయించడం జరుగుతుందని తెలిపారు. బియ్యం కావాల్సిన వారు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు చూపించి బియ్యం కొనుగోలు చేయవచ్చునని , త్వరలోనే పట్టణంలో విక్రయాలు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకొస్తామని ఆమె తెలిపారు. ఈ పరిశీలనలో సిఎస్‌డిటి ఫైజుల్లా తదితరులు పాల్గొన్నారు.
Tags: Quality fine-grain rice for just Rs. 49