November 12, 2026
Explore
ద్విచక్రవాహనం నుంచి పడి మహిళకు గాయాలు

ద్విచక్రవాహనం నుంచి పడి మహిళకు గాయాలు

November 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తు ప్రమాదవశాత్తు కాలుజారి క్రిందపడి మహిళ గాయపడిన సంఘటన మండలంలోని బండ్లపల్లె సమీపంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన రోజా(48) పుంగనూరుకు వస్తుండగా మార్గమధ్యంలోని బండ్లపల్లె సమీపంలోనికి రాగానే ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం నుంచి క్రిందపడింది. ఈ ప్రమాదంలో రోజా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుఠాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Woman sustains injuries after falling from a two-wheeler