16 మంది బోయకొండ భక్తులకు గాయాలు
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు గాయపడ్డారు. ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గాయపడిన వారంతా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరు బోయకొండకు దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సీఐ తెలిపారు.
Tags: Road accident on Madanapalle Bypass.