మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె. గణపతి నియమితులయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏపీ రామకోటేశ్వరరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, విజయభారతి విద్యాసంస్థల ప్రతినిధులు గణపతిని శాలువాతో సన్మానించి అభినందించారు. న్యాయవాదిగా విస్తృత అనుభవం కలిగిన గణపతి ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ఆకాంక్షించారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఆయన సమర్థంగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు.
Tags: Ganapathi Appointed as APP for the 7th Additional District Court