March 18, 2026
Explore
తెలుగు వారి ఉగాధికి సర్వం సిద్ధం

తెలుగు వారి ఉగాధికి సర్వం సిద్ధం

March 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

తెలుగుప్రజల ఉగాధి పండుగ శ్రీ పరాభనామ సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉగాధి పండుగ సందర్భంగా అన్ని ఆలయాలలో ఉగాధి ఆస్థానం నిర్వహించేందుకు అర్చకులు, పండితులు సిద్ధం చేశారు. అలాగే ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి , ముస్తాబు చేశారు. ఆలయాల్లో పూజలు , అభిషేకాలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. ప్రతి ఇంటా ఉగాధి పచ్చళ్లు పూజలు చేసి స్వీకరించేందుకు పచ్చిమామిడికాయలు, వేపపూత, మామిడి ఆకులను బుధవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దుకాణాలు ఏర్పాటు చేసి ఉగాధి పచ్చళ్లకు అవసరమైన వస్తువులు విక్రయించారు. అలాగే ఇండ్లను పూలతో అలంకరించారు. ఉగాధి పండుగ సందర్భంగా హిందువులు తమ కుటుంభాల్లో మరణించిన సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి పూజలు చేసి, బట్టలు పెట్టి, కుటుంబ సభ్యులు అందరి కలసి నూతన వలు ధరించడం ఆనవాయితీ.అలాగే పంటపొలాలు, బోరుబావులకు పండుగ సందర్భంగా పూజలు చేయడం గమనార్హం. నూతన సంవత్సరంలో తమ కష్టాలు తొలగిపోవాలని, పరాభవాలు జరగకుండ భగవంతుడు కాపాడాలని కోరేందుకు సిద్ధమైయ్యారు.

Tags: Everything is ready for the Telugu people’s Ugadi.