May 9, 2026
Explore
శ్రీ అగస్తీశ్వరస్వామి కొండపై భోజనశాల నిర్మాణం

శ్రీ అగస్తీశ్వరస్వామి కొండపై భోజనశాల నిర్మాణం

May 9, 2026 | Andhra Pradesh

  • దాతలు విరాళాలు అందించాలి

పుంగనూరుముచ్చట్లు:

ప్రాచీన ఆలయమైన శ్రీ అగస్తీశ్వరస్వామి కొండపై భక్తులకు భోజనశాల నిర్మాణం సుమారు రూ.20లక్షల రూపాయలతో చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి దాతలు నగదు, వస్తు రూపేణ విరాళాలు అందించాలని స్వామివారి భక్తబృందం కోరుతున్నారు. ఎతైన్న కొండల మధ్య వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలు కలసి సుమారు రూ.5 కోట్లరూపాయలతో ఆలయం, పుష్కరిణి, కొండపై రోడ్డు , విద్యుత్‌ దీపాలు, ఫంక్షన్‌హాల్‌, విశ్రాంతి గదులు నిర్మించారు. ప్రస్తుతం అన్నదాన సత్రం నిర్మిస్తుండటంతో దాతలు విరాళాలు అందించాలని కోరుతున్నారు.

Tags; Construction of a Dining Hall on Sri Agastiswara Swamy Hill