May 9, 2026
Explore
కారు ఢీకొని రైతు దుర్మరణం

కారు ఢీకొని రైతు దుర్మరణం

May 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె అమ్మచెరువుమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం కురబలకోట మండలం దాదంవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు, రైతు సుధాకర్ (50) బైకుపై మదనపల్లెకు వెళ్తుండగా మార్గమధ్యంలో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Farmer Meets Tragic End After Being Hit by Car