పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బలిజపల్లె గ్రామంలో నివాసం ఉన్న షణ్ముగం కుమారై రూప ఫిర్యాదు మేరకు భర్త, వారి కుటుంబ సభ్యులపై అదనపు వరకట్నం కేసు నమోదు చేసినట్లు శుక్రవారం రాత్రి ఎస్‌ఐ రమణ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కురప్పల్లె గ్రామంలో నివాసం ఉండు సుధాకర్‌కు ఇచ్చి రూపను గత 2023 సంవత్సరంన వివాహం జరిపించినారు. లైన్‌మెన్‌గా పనిచేస్తున్నానని మోసగించి, రూపను పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆనాటి నుంచి వరకట్నం కోసం వేదించడం, కుటుంబ సభ్యులతో కలసి కుద్రపూజలు చేసి రూపను చంపేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Tags: Dowry case registered