మైనార్టీ నాయకులు షరీఫ్, ఖాదర్ హెచ్చరిక
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ నాయకులపై పధకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం, వేదించడం చేస్తే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్‌సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, హజ్‌కమిటి మాజీ డైరెక్టర్ ఖాదర్ లు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన తనయుడు ముబషీర్ లపై తప్పుడు కిడ్నాప్ కేసులు బనాయించి, నూజివీడు పోలీసులు అరెస్ట్ చేయడం బాధకరమన్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్‌సిపి నాయకులు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరింఛారు. తెలుగుదేశం ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని , ముస్తఫా కుటుంభానికి అండగా ఉంటామని తెలిపారు. ముస్తఫా కుటుంబంపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకుని, తండ్రి , తనయులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Tags: We will not remain silent if former MLA Mustafa’s family is harassed.