అమరావతి ముచ్చట్లు:
ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలి : సీఎం చంద్రబాబు
డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లు, 2027 డిసెంబర్ నాటికి అదనంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి.
అర్హులైన 2 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపు.
కేంద్రం నుంచి ఎస్సీ హోదా వచ్చే వరకు, ఉద్యోగాలు మినహా ఎస్సీలకు అందే అన్ని సంక్షేమ పథకాలు బుడగ జంగాలకు వర్తింపజేయాలి.
ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలి; దీనివల్ల విజయవాడ, విశాఖలో 90 వేల మందికి లబ్ధి.
బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్.. నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై నిర్ణయం.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ముస్లింల కోసం ‘రూరల్ ఆటోనగర్’ లు మరియు వక్ఫ్ భూముల్లో ‘లైవ్లీ హుడ్ హబ్’ల ఏర్పాటు.
బీసీ హాస్టళ్లలో ఆధునిక వసతులు.. RO ప్లాంట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మరమ్మతులకు ఆదేశం.
గుంటూరులో పెండింగ్‌లో ఉన్న 22A భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం.
Tags; Mass Housewarming Ceremonies for 2.50 Lakh Homes Across the State by August 15