May 8, 2026
Explore
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత

ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత

May 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు వీలుందని , దీని కారణంగా ప్రజలు భాగస్వాములు కావాలని డీపీవో రాధమ్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అప్పాజి, డిఎల్‌డివో శ్రీనివాసులు, ఈవోపిఆర్‌డి నారాయణల లతో కలసి పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ ప్రతి ఇంటా చెత్తసేకరణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీటి సరఫరా, పన్నుల వసూళ్లపై పలు సూచనలు చేశారు. వేసవిలో ఎలాంటి అంటువ్యాదులు ప్రభలకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags: Cleanliness through Public Participation