March 18, 2026
Explore
స్వయంగా బస్సు నడిపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

స్వయంగా బస్సు నడిపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

March 18, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

మాట ఇచ్చాం.. నెరవేర్చాం – ఎమ్మెల్యే బోడె ప్రసాద్

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానిని నెరవేర్చే దిశగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

పోరంకి నుంచి కంకిపాడు వరకు దివ్యాంగులని ఎక్కించుకొని స్వయంగా బస్సు నడిపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

దివ్యాంగులతో పాటు టిడిపి కృష్ణాజిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, కూటమి నాయకులు ప్రయాణించారు

ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ..

మాట ఇచ్చిన ప్రకారమే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాము

దివ్యాంగులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చు

దివ్యాంగులకు సహాయంగా వచ్చేవారు 50% రాయితీతో ప్రయాణం చేసే వెసలు బాటు కూటమి ప్రభుత్వం కల్పించింది

పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న 3903 దివ్యాంగులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు

ఇప్పటికే శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాము

దివ్యాంగులందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు

జిల్లా అధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ..

దివ్యాంగులకు ఈరోజు శుభదినం

రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే రెండు లక్షల మంది మాత్రమే పాస్ సౌకర్యం వినియోగించుకుంటున్నారు

వారి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు

2014లో 500 ఉన్న పెన్షన్ ను ఈరోజు 6000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది

దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలిపారు.

Tags: MLA Bode Prasad launches the ‘Divyang Shakti’ scheme by personally driving a bus.