పీలేరు ముచ్చట్లు:
పీలేరు నియోజకవర్గంలోని పలు ప్రాచీన ఆలయాల అభివృద్ధికి సర్వ శ్రేయోనిధుల నుంచి రూ.6.78 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని దేవాదాయ శాఖ ఈవో మంజుల నగిరిపల్లిలో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
దొడ్డిపల్లి శ్రీ చెన్నకేశ్వరస్వామి ఆలయానికి రూ.63.50 లక్షలు, అన్నంగివారిపల్లె మాతమ్మ ఆలయానికి రూ.75 లక్షలు, చింతపర్తి గుంటి వీరగంగమ్మ ఆలయానికి రూ.1 కోటి, మంజూరు సోమేశ్వరస్వామి ఆలయానికి రూ.1 కోటి, చెర్లోపల్లి రెడ్డమ్మ దేవత ఆలయానికి రూ.2.20 కోట్లు, గుండ్లూరు చెన్నకేశవస్వామి ఆలయానికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి.ఆలయాల అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Tags: ₹6.78 Crores for the Development of Temples in Pileru Constituency