May 8, 2026
Explore
మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం.

మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం.

May 8, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం.
  • మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీమ్ నిర్వహణ.
  • ఎంఆర్ పల్లి ప్రాంతంలోని KSRM కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈగల్ టీమ్‌తో కలిసి కార్యక్రమం.
  • మహిళల భద్రత, సైబర్ నేరాలు, చైల్డ్ మ్యారేజ్, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన.
  • శక్తీ యాప్, డయల్ 112, సైబర్ హెల్ప్‌లైన్ 1930 వినియోగంపై కీలక సూచనలు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీమ్ ఈరోజు ఎంఆర్ పల్లి ప్రాంతంలోని KSRM కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈగల్ టీమ్ సిబ్బందితో కలిసి మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
  • ఈ సందర్భంగా ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, టీనేజ్ వయస్సులో ఆకర్షణలకు లోనైతే కలిగే పరిణామాలు, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనే విధానం గురించి వివరించారు. చదువుతో పాటు తమ బలాలు, బలహీనతలను గుర్తించి ఇతర రంగాల్లోనూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఆత్మహత్య వంటి ఆలోచనలకు దూరంగా ఉండి జీవితంలో ముందుకు సాగాలని అవగాహన కల్పించారు.
  • చైల్డ్ మ్యారేజ్ నేరమని, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, మహిళల మోసాలకు సంబంధించిన కేసులు, మహిళలపై నేరాలు, BNS, BNSS, POCSO చట్టాలపై వివరించారు. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, తెలియని వీడియో కాల్స్, లోన్ యాప్స్, ఆన్‌లైన్ జాబ్స్ పేరుతో జరిగే మోసాలు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై విద్యార్థులను అప్రమత్తం చేశారు.
  • కార్యక్రమంలో శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సేవల కోసం డయల్ 112, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1930 గురించి కూడా తెలిపారు.

Tags: Awareness Program on Women’s Safety