పుంగనూరుముచ్చట్లు:
కబడ్డీ క్రీడలకు పేరుగాంచిన పుంగనూరు పట్టణంలో వేసవిలో బాలికలకు కబడ్డీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కబడ్డీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు. గురువారం రాత్రి స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో కబడ్డీ శిక్షణా తరగతులను ఆయన తహశీల్ధార్ మాధవరాజు, మాజీ క్రీడాకారులు నాగరాజ, భరత్‌భూషణ్ ల ఆధ్వర్యంలో శిక్షణకు వచ్చిన బాలికలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహశీల్ధార్ మాట్లాడుతూ బాలికలు క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడలకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన తహశీల్ధార్‌కు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు గాయిత్రి, శ్రీలక్ష్మీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Kabaddi Training for Girls in Summer