March 17, 2026
Explore
సర్వేయర్ల సమస్యలను పరిష్కరిస్తాం

సర్వేయర్ల సమస్యలను పరిష్కరిస్తాం

March 17, 2026 | Andhra Pradesh


-జిల్లాఅధ్యక్షుడు శ్రీనివాసులునాయక్‌

పుంగనూరుముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్వేయర్ల సంఘ నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులునాయక్‌ తెలిపారు. మంగళవారం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రీనివాసులునాయక్‌ను తహశీల్ధార్‌ రాము, పుంగనూరు దళిత నేతలు అశోక్‌, రాజు, కుమార్‌, రెడ్డి, మణి తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులునాయక్‌ మాట్లాడుతూ జిల్లా సర్వేయర్ల సంఘం అధ్యక్షుడుగా ఎంపిక చేసినందుకు సర్వేయర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వేయర్లు ప్రజల సమస్యలను పెండింగ్‌ పెట్టకుండ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేసి , ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళితనేతలు గంగప్ప, కృష్ణప్ప , పరమేష్‌ , బాలాజి, నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: We will resolve the surveyors’ issues.