July 9, 2026
Explore
ప్రైవేటు కాలేజ్‌ బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

ప్రైవేటు కాలేజ్‌ బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

July 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అతివేగంగా వస్తున్న కళాశాల బస్సు ఢీకొని ద్విచక్రవాహనంలో వస్తున్న సంతోష్‌కుమార్‌(35) తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. మంగళం కాలనీకి చెందిన సంతోష్‌కుమార్‌ పుంగనూరుకు వస్తుండగా మదనపల్లెకి చెందిన ప్రైవేటు కళాశాల బస్సు ఎంబిటి రోడ్డులో్య ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags : Youth sustains severe injuries after being hit by a private college bus.