పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని జె న్యూటౌన్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి వృద్ధురాలు గాయపడిన సంఘటన గురువారం జరిగింది. చౌడేపల్లె మండలం రంగోనిమిట్టకు చెందిన నౌషాద్ తన ద్విచక్రవాహనంలో మీరాన్‌బి(70) అనే వృద్ధ మహిళను ద్విచక్రవాహనంలో పిలుచుకుని వస్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనంలో నుంచి ఆమె అదుపుతప్పి క్రిందపడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను అంబులెన్స్కు ప్రభుత్వాసుపత్రకి తరలించారు. చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Woman injured after two-wheeler overturns