300 కేజిల కమ్మి స్వాధీనం
పుంగనూరుముచ్చట్లు:
గ్రామీణప్రాంతాల్లోని రైతులకు సంబంధించి రాగి కేబుల్ వైర్లను దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షలు విలువ చేసే 300 కేజిల రాగి కమ్మిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఎస్‌ఐ అన్సర్‌బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఖలీల్, అనిల్ రాత్రి పూట కేబుల్ వైర్లు చోరీ చేసేవారు. దీనిపై రైతుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని కర్నాటక సరిహద్దుల్లో పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Tags: Two arrested in copper bar theft case