May 6, 2026
Explore
గాలివీడులో భూ కబ్జాలపై ఏఐఏడబ్ల్యూయు నేత శ్రీనివాసులు డిమాండ్

గాలివీడులో భూ కబ్జాలపై ఏఐఏడబ్ల్యూయు నేత శ్రీనివాసులు డిమాండ్

May 6, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు:

గాలివీడు మండలంలో జరుగుతున్న భూ కబ్జాలను అరికట్టి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం వెలుగు ప్రాజెక్టు వద్ద చేపల కాలనీ వెనుక ఉన్న భూములను పరిశీలించి ఆయన మాట్లాడారు.

మూడు నెలల క్రితం వరకు గుట్టగా ఉన్న భూమిని ఇటీవల చదును చేసి ఫెన్సింగ్ వేయడం ద్వారా ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో పేదలతో గుడిసెలు వేయించి పోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Tags:AIWUU Leader Srinivasulu Demands Action Against Land Encroachments in Galiveedu