May 6, 2026
Explore
మంగంపేటలో కత్తితో హల్‌చల్

మంగంపేటలో కత్తితో హల్‌చల్

May 6, 2026 | Andhra Pradesh

– ట్రాన్స్పోర్ట్ వివాదం ఉద్రిక్తతకు దారి

మంగంపేట ముచ్చట్లు:

ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ముగ్గురాయి ట్రాన్స్పోర్ట్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన రాజనాల చంద్రశేఖర్ తన లారీకి అనుమతి ఇవ్వాలని ఓ ప్రైవేట్ మిల్లు మేనేజర్ సుంకర ఉమామహేశ్వరరావును కోరారు.

అయితే ఆయన నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన చంద్రశేఖర్ కత్తితో బెదిరించినట్లు సమాచారం. అంతేకాక మిల్లులోకి వచ్చిన ఇతర లారీలను అడ్డగించి హడావుడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భయాందోళనకు గురైన మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Knife fight in Mangampeta