రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండలం మొరంపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చలపతి (55) మృతి చెందాడు. ఆయన చెట్టుకు లుంగీతో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించడంతో గ్రామస్థులు వెంటనే స్పందించి కిందకు దించారు.
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Tags:Tragic Incident in Ramasamudram Mandal – Man Dies