May 6, 2026
Explore
మదనపల్లిలో బాలుడికి కాఫీ పడడంతో గాయాలు

మదనపల్లిలో బాలుడికి కాఫీ పడడంతో గాయాలు

May 6, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలో మంగళవారం ఓ ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. బాలుడిపై వేడి కాఫీ పడడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే రామాంజులు, రాణెమ్మ దంపతులు అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి సామగ్రిని మూటల్లో సర్దుతున్నారు.

ఈ సమయంలో రాణెమ్మ కాఫీ తయారు చేసి భర్తకు గ్లాసులో పోసి టేబుల్‌పై పెట్టింది. అదే సమయంలో వారి కుమారుడు నవీన్ వచ్చి అనుకోకుండా గ్లాస్‌ను లాగడంతో వేడి కాఫీ అతని మీద పడింది. దీంతో బాలుడు గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Tags: Boy Injured After Coffee Spills on Him in Madanapalle