March 17, 2026
Explore
భూ గర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోండి

భూ గర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోండి

March 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అడుగంటిపోతున్న భూగర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏడిఏ శివకుమార్‌ సూచించారు. మంగళవారం మండలంలోని అరవపల్లె గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల చేశారు. ఏడి మాట్లాడుతూ ఈనెల 25 వతేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు బోరుబావుల క్రింద వరిసాగు వేయడం ఆపివేసి, ఆరుతడి పంటలను పండించాలని సూచించారు. అన్నదాత సుఖిభవ తదితర పథకాలు పొందాలంటే రైతులు ఏపిఏఐఎంఎస్‌2.0 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.రైతులకు ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

Tags: Use groundwater carefully.