March 17, 2026
Explore
బాధిత కుటుంభానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంభానికి ఆర్థిక సహాయం

March 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని నాయిబ్రాహ్మణ కుటుంభానికి చెందిన మురళి, రేవతి దంపతుల పిల్లలు , వారి తండ్రి చనిపోవడం బాధకరమని టీటీడీ బోర్డు సభ్యులు , రాష్ట్ర నాయిబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు శాంతరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బాధిత కుటుంభాన్ని ఆయన పరామర్శించి , ఓదార్చి, ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంభాన్ని అన్ని విధాల ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ప్రభాకర్‌, చంద్రశేఖర్‌, ప్రకాష్‌, శివకుమార్‌, లోకేష్‌కుమార్‌, రమణ, భద్రి, వెంకటేష్‌, హేమంత్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags: Financial Assistance to the Affected Family