May 5, 2026
Explore
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సరికొత్త అడుగు

మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సరికొత్త అడుగు

May 5, 2026 | Andhra Pradesh

– 10 కంట్రోల్ బూత్‌లను ప్రారంభించిన జిల్లా ఎస్పీ!

💠అన్నమయ్య సర్కిల్‌లో రిబ్బన్ కట్ చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఎండ, వానల నుండి సిబ్బందికి రక్షణ.. ప్రజలకు అందుబాటులో సేవలు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ పిలుపు.

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అత్యాధునిక ట్రాఫిక్ కంట్రోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మంగళవారం మదనపల్లిలోని అన్నమయ్య సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ముఖ్య అతిథిగా హాజరై, 10 ట్రాఫిక్ బూత్‌లను ప్రారంభించారు.

సిబ్బంది సంక్షేమం – ప్రజల భద్రతే ధ్యేయం: ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మదనపల్లి పట్టణం జిల్లాలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ సవాలుగా మారిందని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఎండ, వానల నుండి రక్షణ పొందుతూనే, ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ఈ బూత్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 10 బూత్‌లను ప్రారంభించామని, పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి, మదనపల్లిని రోడ్డు ప్రమాదాలు లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ బూత్‌ల ఏర్పాటు వల్ల పోలీసుల ఉనికి కూడళ్లలో స్పష్టంగా కనిపిస్తుందని, ఇది నేర నియంత్రణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి పాల్గొని ట్రాఫిక్ బూత్‌ల పనితీరును పరిశీలించారు. మదనపల్లి డీఎస్పీ బి. పావని . ట్రాఫిక్ సీఐ గురునాథ్, ఎస్‌బి సీఐ పి. రాజా రమేష్, మదనపల్లి వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ జి. రవి మరియు పలువురు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: A Brand-New Step Towards Traffic Streamlining in Madanapalle