వాల్మీకిపురం ముచ్చట్లు:
చైన్ స్నాచింగ్ తో మహిళల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ ధీరజ్ నిందితుల అరెస్టు వివరాలు మంగళవారం మదనపల్లెలో వివరించారు. వాల్మీకిపురం ఏటిగడ్డ శివాలయం వద్ద అనుమానస్పదంగా ఉంటూ, చైన్ స్నాచింగ్ కు పాల్పడే మహిళలతో కూడిన ఐదుగురు సభ్యుల ముఠాను సీఐ రాఘవరెడ్డి సిబ్బందితో వెళ్లి పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.11,62,500 విలువైన 77గ్రాముల బంగారు ఆభరణాలు, 4 సెల్ ఫోన్లు, 2బైకులను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు..
Tags: Chain Snatching Gang Arrested