అమరావతిముచ్చట్లు:
పాలిసెట్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 3,397 మంది పరీక్ష రాయగా 3,085 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,796 మంది బాలురు, 1,289 మంది బాలికలు ఉన్నారు.
116 మార్కులతో దుత్తలూరు సిద్ధిక్, డేరంగుల రెడ్డి శేఖర్ జిల్లా టాపర్లుగా నిలిచారు. 115 మార్కులతో చింతంరెడ్డి రూప రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో సిద్ధిక్ 229వ, రెడ్డి శేఖర్ 279వ, రూప 376వ ర్యాంకులు సాధించి జిల్లా ప్రతిష్టను నిలబెట్టారు.
Tags: Annamayya district students’ performance in POLICET