May 5, 2026
Explore
రాయచోటి పట్టణంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం

రాయచోటి పట్టణంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం

May 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. ఎస్పీ బంగ్లాకు సమీపంలోని ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు వద్ద ముగ్గు వేసి ప్లాస్టిక్ బొమ్మను ఉంచి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి దీపాలు వెలిగించిన ఆనవాళ్లు కనిపించాయి.

ఇటీవల ఈ ప్రాంతాన్ని క్షుద్ర పూజలకు కేంద్రంగా చేసుకుని వరుసగా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాయచోటి పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: Occult Rituals Scandal Rocks Rayachoti Town