సుండుపల్లి ముచ్చట్లు:
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ నవధాన్యాల కిట్లు రైతులకు పంపిణీ చేశారు. సుండుపల్లి మండలంలోని పెద్ద హరిజనవాడకు చెందిన రైతులకు తిమ్మసముద్రం బయో రిసోర్స్ సెంటర్ ద్వారా శివజ్యోతి మంగళవారం నవధాన్యాల కిట్లు, పెరటి తోట విత్తనాలు అందజేశారు.
ఈ సందర్భంగా డిఎంఎంటి వీరనాగయ్య మాట్లాడుతూ ప్రధాన పంటకు ముందుగా నవధాన్యాలు సాగు చేయడం వల్ల భూమి పోషకాలు పెరిగి, ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. రసాయన ఎరువుల అవసరం తగ్గి, నత్రజని, భాస్కరము, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా లభించి పంట ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని సూచించారు.
Tags: Distribution of new grain kits to farmers