May 5, 2026
Explore
గుళ్ళల్లో చోరీలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

గుళ్ళల్లో చోరీలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

May 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, మదనపల్లె అనగుట్ట కృష్ణుడు గుడి, వాల్మీకిపురంలలో చోరీల కి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి జిల్లా ఎస్పీ ధీరజ్ మీడియాకు తెలిపిన వివరాలు.. అంతర్రాష్ట్ర దొంగలు ఫిబ్రవరి 24న మదనపల్లె అనుగుట్టలో ఉన్న కృష్ణుని గుడి తలుపులు పగలగొట్టి, చోరీ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో స్వామివారి బంగారు తాళిబొట్లు, వెండి కిరీటాలు సీజ్ చేసి, నలుగురు దొంగల్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Tags: Inter-state gang of temple thieves arrested.