May 5, 2026
Explore
యంత్రాల వినియోగంతో చిన్న, సన్నకారు కూలీలకు ఉపాధి కష్టం

యంత్రాల వినియోగంతో చిన్న, సన్నకారు కూలీలకు ఉపాధి కష్టం

May 5, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా లో యంత్రాల వినియోగం పెరగడంతో చిన్న, సన్నకారు కూలీలకు ఉపాధి కష్టంగా మారింది. గతంలో వరి నాట్లు, కోత పనులు పూర్తిగా కూలీలపై ఆధారపడేవి. ప్రస్తుతం వరికోత యంత్రాలు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో కూలీలకు పనులు తగ్గిపోయాయి.

అలాగే గుంతలు త్రవ్వడం, కాలువలు తీయడం వంటి చిన్నపనులు కూడా జేసీబీ వంటి యంత్రాలతోనే నిర్వహిస్తున్నారు. వరి కోత యంత్రం గంటకు సుమారు రూ.2300 చెల్లించి మొత్తం పంట కోయడంతో రైతులకు సౌలభ్యం కలుగుతున్నా, కూలీలు ఉపాధి కోల్పోతున్నారు.

ఉపాధి హామీ పథకంలో కూడా పరిమితంగానే పనులు లభిస్తున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసలు తగ్గించాలంటే కూలీలకు సంవత్సరానికి 100 రోజుల పని కల్పించాలని కేంద్రం చెప్పినా అమలు సరిగా లేదని అంటున్నారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: The use of machinery makes it difficult for small and marginal laborers to find employment.