May 5, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మృతి

May 5, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చిలేకంపల్లి వెంకటరామిరెడ్డి (39) రాయచోటి–గాలివీడు రింగ్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు కడపలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags: YSRCP Leader Dies in Road Accident