పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయాన్ని పురస్కరించుకుని రాయచోటిలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. బంగ్లా సర్కిల్ వద్ద బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేతలు అరమాటి శివగంగి రెడ్డి, పాలగిరి శ్రీనివాస రాజు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో పార్టీ సంస్థాగత బలం, కార్యకర్తల కష్టపాటుతో ఈ విజయం సాధ్యమైందన్నారు. బెంగాల్‌లో గట్టి పోటీ మధ్య విజయం సాధించడం పార్టీకి గొప్ప మైలురాయిగా పేర్కొన్నారు.
ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: Celebrations in Rayachoti over BJP’s victory.