రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరధరామిరెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. దశరధరామిరెడ్డిపై తీవ్ర దాడి జరిగినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం తగదన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇకపై వైకాపా కార్యకర్తలపై దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Tags: “If you launch attacks, we will pay you back with interest”—MP Mithun Reddy warns.