May 5, 2026
Explore
స్థల వివాదంలో మంత్రికి సంబంధం లేదంటూ బాధితుల స్పష్టం

స్థల వివాదంలో మంత్రికి సంబంధం లేదంటూ బాధితుల స్పష్టం

May 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని చిత్తూరు రింగ్ రోడ్ వద్ద ఉన్న తమ స్థల వివాదానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని రిటైర్డ్ డీఈ ఆదినారాయణ రెడ్డి, సుమన దంపతులు స్పష్టం చేశారు. దశరథరామిరెడ్డి వర్గీయులే తమపై దాడి చేసి, మహిళను కూడా చూడకుండా సుమనపై దాడి చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమ స్థలంలోకి రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ అడ్డుకుంటున్నారని, తాము చట్టబద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. దశరథరామిరెడ్డి పై జరిగిన దాడికి తమకు, మంత్రికి సంబంధం లేదని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags: Victims Clarify Minister Has No Involvement in Land Dispute