May 5, 2026
Explore
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ

అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ

May 5, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ ధీరజ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లలోనే ఫిర్యాదులు ఇచ్చినా త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Tags: No Delays Whatsoever in Resolving Petitions: SP