May 5, 2026
Explore
మంత్రి పై ఆరోపణలు ఖండన.. టీడీపీ మహిళా నేతల హెచ్చరిక

మంత్రి పై ఆరోపణలు ఖండన.. టీడీపీ మహిళా నేతల హెచ్చరిక

May 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలను టీడీపీ మహిళా నేతలు సుజాత, రమ్య, హజీరా తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు రింగ్ రోడ్ వద్ద జరిగిన స్థల వివాదానికి మంత్రికి లేదా ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రిటైర్డ్ డీఈ ఆదినారాయణ రెడ్డి, దశరథరామిరెడ్డి మధ్య పాత వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం మంత్రికి ముడిపెట్టడం తగదని విమర్శించారు. అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Tags: Denial of Allegations Against Minister: TDP Women Leaders Issue Warning