May 5, 2026
Explore
దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

May 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత్లో సోమవారం అత్యంత వేడి ప్రదేశంగా మహారాష్ట్ర లోని బ్రహ్మపురి (44.2°C) నిలిచినట్లు ఐఎండీ వెల్లడించింది. దీని తర్వాత వార్ధా(43.5°C), చంద్రాపూర్ (43.4°C) రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్లో 43.3°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దేశవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Tags: Blazing heat across the nation; record-high temperatures recorded.