అమరావతిముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ, స్పెషల్ కేర్గా 4 రకాలుగా(ఆకుపచ్చ, పసుపు, పింక్, ఎరుపు డబ్బాలు) వేరు చేయడం తప్పనిసరి. 2029 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ‘కాలుష్య కారకులే చెల్లించాలి’ అనే సూత్రంతో జరిమానాలు విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో పాటు గ్రామాలు, పట్టణాలకూ ఇవి వర్తిస్తాయి.
Tags: Polluters must pay the fines.