ముగిసిన ఎర్ర జెండా రెపరెపలు
దేశవ్యాప్తంగా అధికారానికి దూరమైన వామపక్షాలు!
కేరళ ముచ్చట్లు:
కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 2021లో వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించిన విజయన్ ప్రభుత్వం, తాజా ఎన్నికల్లో పరాజయం పాలైంది.వెస్ట్ బెంగాల్లో 34 ఏళ్ల పాలన 2011లో ముగియగా, 2018లో త్రిపుర కూడా చేజారింది. ఇప్పుడు కేరళలోనూ అధికారం కోల్పోవడంతో, దేశంలో లెఫ్ట్ పార్టీలు పాలనలో ఉన్న రాష్ట్రం ఏదీ లేకపోవడం గమనార్హం. వామపక్షాల ఉనికి ఇప్పుడు కేవలం పోరాటాలకే పరిమితమైంది.
Tags: The Sunken Red Fort