బాపులపాడు ముచ్చట్లు:
చాలా రోజలకు అమ్మమ్మవాళ్ల ఇంటికి వచ్చిన ఆనందంలో అల్లరిచేసింది.. కానీ ఆరోజే చివరి రోజని.. మామతో కలిసి షికారుకు వెళ్లిన ప్రయాణమే తనకు చివరి యాత్ర అని కలలోకూడా ఊహించుండదు.. కాసేపటిలో ఇంటికెళ్తానని ఆ చిట్టితల్లి.. ఇంకా రాలేదేంటని కన్నతల్లి.. ఎదురుచూసిన ఆశలను ఓ లారీ చిదిమేసింది. అప్పటివరకు మామా మామా అంటూ ద్విచక్రవాహనంపై ఆనందంగా తిరిగిన చిట్టితల్లి అంతలోనే అనంతలోకాలకు చేరింది. బాపులపాడు మండలం వీరవల్లిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కలచివేసింది. వివరాల్లోకెళితే.. స్థానిక ఆర్పీహెచ్ కాలనీలోని స్వప్నకు, బాపులపాడు మండలం రామన్నగూడేనికి చెందిన పాగోలు రవికిశోర్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. సోమవారమే స్వప్న ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వచ్చింది. సాయంత్రం 5.30 గంటలసమయంలో రెండో కుమార్తె రియాల్టీని తీసుకుని మేనమామ సునీల్ సరదాగా ద్విచక్రవాహనంపై వీరవల్లి కూడలికి తీసుకువచ్చాడు. తిరిగి ఇంటి వెళుతున్న క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమీపంలో వెనక నుంచి దాణా లోడుతో వెళుతున్న లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాళ్లిద్దరూ కింద పడిపోగా, లారీ రియాన్షీ తలపైకి ఎక్కడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. సునీల్కు గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. గేదెలు, అడ్డురావడం, రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. లారీ డ్రైవర్ పరారవ్వగా, గ్రామస్థులు లారీని తీయకుండా ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న వీరవల్లి, హనుమాన్ జంక్షన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. లారీ చక్రాల కింద బాలిక మృతదేహం ఇరుక్కుపోవడంతో జాకీల సాయంతో పైకి లేపి అతికష్టం మీద బయటకు తీయగలిగారు. నవ్వుతూ ఇంటి నుంచి వెళ్లిన తన కుమార్తె అత్యంత దారుణంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లి.. ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నెలకొంది. సీఐ రమేష్ గ్రామస్థులతో చర్చలు జరిపారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Tags:Until then, she played and sang… smiling, she wandered all around the house.