రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం కల్పనాయిని చెరువులో చోటుచేసుకున్న దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ రామకృష్ణ కుటుంబంపై కొందరు దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. స్థల వివాదం నేపథ్యంలో రామకృష్ణ తన ఇంటి నిర్మాణ సమయంలో రెండు అడుగుల స్థలం వదిలివేయగా, దానిని కలుపుకొని నరసింహులు నిర్మాణం చేపట్టాడని తెలిపారు. ఈ విషయంపై గ్రామ పెద్దలు పంచాయితీ చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.
అనంతరం పెద్దలు వెళ్లిన తర్వాత కొందరు వ్యక్తులు కర్రలు, కొడవళ్లతో దాడి చేయడంతో రామకృష్ణ (67), ఆయన భార్య లక్ష్మీదేవి (65), సోదరి లక్ష్మమ్మ (70) తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మీదేవికి తలకు గాయం కావడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో టీడీపీ అనుచరుల పాత్ర ఉందని బాధితులు ఆరోపిస్తూ, మూడు రోజులుగా పోలీసులను ఆశ్రయిస్తున్నా తమ ఫిర్యాదును స్వీకరించడం లేదని బాధితులు వాపోయారు.
Tags: Attack on Ramakrishna’s Family