May 5, 2026
Explore
అన్నమయ్య వాసి హత్య.. తల్లి, కొడుకు అరెస్ట్

అన్నమయ్య వాసి హత్య.. తల్లి, కొడుకు అరెస్ట్

May 5, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. గాలివీడు మండలం పిడకంటి కొత్తపల్లికి చెందిన శివారెడ్డి (40) బాలానగర్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన అరుణ తన కుమారుడు సాయిరత్నం (19)తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి శివారెడ్డితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే శివారెడ్డి వారిని తరచూ వేధించడంతో ఆగ్రహించిన తల్లి, కుమారుడు అతని నోట్లో గుడ్డలు కుక్కి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags: Annamayya Resident Murder: Mother and Son Arrested