May 4, 2026
Explore
భారత దేశ జనాభాలో ఏకంగా 78% బీజేపీకి జై కొట్టారు

భారత దేశ జనాభాలో ఏకంగా 78% బీజేపీకి జై కొట్టారు

May 4, 2026 | Andhra Pradesh

: భారత్ నరేంద్రమోదీ

పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్

దేశ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం, దక్షిణాదిన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో దేశ మ్యాప్ కాషాయమయం అయింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉండగా.. 20 చోట్ల కాషాయ జెండా ఎగిరిందంటే బీజేపీ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాన మూడు, దక్షిణాన నాలుగు, ఈశాన్యంలో ఒకటి, తూర్పున ఒక రాష్ట్రం మినహా మిగిలినవన్నీ కూడా బీజేపీకి లభించాయి.

జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. ఇది- దేశ మొత్తం భూభాగంలో 72 శాతం. అలాగే దేశ జనాభాలో 78 శాతం. అంటే వంద కోట్ల మందికి పైగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అలాగే దేశ మొత్తం విస్తీర్ణంలో ముప్పావు భాగానికి పైగా బీజేపీకి హస్తగతమైంది. దీనిపై ఇండియాటుడే ఓ మ్యాప్ ను ప్రచురించింది.

2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అవి.. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, గోవా, నాగాలాండ్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశాక.. వీటి సంఖ్య భారీగా పెరిగింది. 20కి చేరింది. అప్పట్లో దేశ విస్తీర్ణంలో బీజేపీ విస్తరించిన భూభాగం 34 శాతం. కాగా ఆ పార్టీకి పట్టం కట్టిన జనాభా మొత్తం 25 శాతమే. 2018 నాటికి అది 74, 69 శాతానికి చేరుకున్నాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసేసరికి బీజేపీకి జై కొట్టిన దేశ జనాభా మరింత పెరిగింది. 78 శాతానికి చేరింది. ఇప్పుడు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు చాలా పరిమితం అయ్యాయి. ఎన్డీఏ విస్తరించిన భూభాగం 72, ఆ పార్టీకి పట్టం కట్టిన జనభా 78 శాతానికి చేరింది. దేశ జనాభాలో 22 శాతం మంది మాత్రమే బీజేపీ వైపు మొగ్గు చూపట్లేదు.

Tags: A staggering 78% of India’s population hailed the BJP.